Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీ20 వరల్డ్ కప్: పొరుగుదేశంపై గెలిచిన ఇంగ్లండ్

Tom Banton Leads England to Victory Over Scotland
Advertisement
  • టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచిన ఇంగ్లండ్
  • అజేయంగా 63 పరుగులు చేసి జట్టును గెలిపించిన టామ్ బాంటన్
  • కీలక భాగస్వామ్యాలతో గట్టెక్కిన ఇంగ్లీష్ జట్టు
  • అంతకుముందు స్కాట్లాండ్‌ను 152 పరుగులకే కట్టడి చేసిన బౌలర్లు
  • ఆదిల్ రషీద్‌కు మూడు, జోఫ్రా ఆర్చర్‌కు రెండు వికెట్లు
Advertisement
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో తమ పొరుగుదేశం స్కాట్లాండ్‌పై ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టామ్ బాంటన్ (63 నాటౌట్) అద్భుత అర్ధశతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇటీవల విండీస్ చేతిలో ఓడిన ఇంగ్లండ్ కు ఈ విజయం ఊరటనిచ్చింది. 

153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (2), కెప్టెన్ జోస్ బట్లర్ (3) స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో జాకబ్ బెథెల్ (32)తో కలిసి బాంటన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 66 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. బెథెల్ ఔటైనప్పటికీ, బాంటన్ మాత్రం దూకుడుగా ఆడి 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి వరకు క్రీజులో నిలబడి మరో 10 బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించాడు.

అంతకుముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్, స్కాట్లాండ్‌ను 19.4 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌట్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఆరంభంలోనే రెండు వికెట్లు పడగొట్టినా, స్కాట్లాండ్ బ్యాటర్లు రిచీ బెరింగ్టన్ (49), మైఖేల్ జోన్స్ (33) రాణించారు. దీంతో స్కాట్లాండ్ పోరాడగలిగే స్కోరు సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 3 వికెట్లు పడగొట్టాడు.
Advertisement
Advertisement
Tom Banton
T20 World Cup
England vs Scotland
England victory
cricket
Eden Gardens
Adil Rashid
Jofra Archer
cricket match
Jacob Bethell

More Telugu News